Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టుదల, అకుంఠిత దీక్ష, జీవితంలో లక్ష్యం అనే వాటితో ఏదైనా సాధించవచ్చునని ధర్మవరం ఆర్డీవో మహేష్ రుజువు చేశారు. విద్య అనే పోరాటంలో ఎన్ని కెరటాలు ఎదురైనా, ఎదు రెడ్డి తన లక్ష్యాన్ని సాధించుకున్నారు. సడలని సంకల్పంతో శ్రమించి జీవితములో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అంతేకాకుండా చదువు ముగించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో కూడా తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుత ధర్మవరం ఆర్డీవో చిత్తూరు జిల్లా, నగిరి మండలం, నంబాకం గ్రామం నివాసంగా ఉన్నారు. వీరి తండ్రి గోపాల్ రెడ్డి, అమ్మ సరోజమ్మ వ్యవసాయ కుటుంబంలో ఉంటూ కుమారుని చదివించారు. తన స్వగ్రామంలో ఐదవ తరగతి వరకు చదివి డిగ్రీ వరకు నగరిలో చదివారు. తాను చదువుతున్న సమయంలోనే సెలవుల్లో ఉపాధి హామీ కూలి పనులకు వెలుతూ మరోవైపు ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్లు చూపుతూ వచ్చిన డబ్బుతో ఫీజులు కట్టుకునేవారు. తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో పీజీ, సిహెచ్డి పూర్తి చేశారు. తన కుటుంబం పేదరికంలో ఉన్నా కూడా, చదువుపై ఉన్న పట్టుదలతో సొంతంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. అనంతరం పాలిటెక్నిక్ అధ్యాపకులుగా ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే గ్రూపు వన్ కు సిద్ధమయ్యారు. దీంతో తన పట్టుదలతో అదృష్టాన్ని వరించింది. 2022లో ఉత్తీర్ణత సాధించి ఆర్డిఓ ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నారు. తదుపరి విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహించి, అక్కడ అందరి మన్ననలతో పాటు మంచి గుర్తింపు కూడా పొందారు. 2024 అక్టోబర్లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఆర్డిఓ గా విధులలో చేరారు. తన డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఏ సమస్య వచ్చినా, దానిని పరిష్కరించేంతవరకు ఆణిముత్యం కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ధర్మవరం డివిజన్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించిన అధికారిగా ఉన్నతాధికారుల వద్ద మంచి ప్రశంసలు కూడా పొందారు. అంతేకాకుండా తన సతీమణి కూడా ఇప్పటికీ తనకన్నా పై హోదాకు వచ్చేలోగా ప్రోత్సహిస్తున్నారు. మరి పట్టుదల, కృషికి తోడు భర్త ప్రోత్సహిస్తుండడం భవిష్యత్తులో సతీమణి కూడా మంచి ఉన్నతాధికారిగా ఎంపిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యువ కెరటంగా, నేటి యూత్ ప్రపంచంలో ఆర్డిఓ గా ప్రభుత్వ ఉద్యోగం పొందడంతో పాటు ప్రజలందరికీ చట్ట ప్రకారం న్యాయాన్ని చేకూర్చే విధంగా ముందుకెళుతున్నారు. వచ్చిన ఒక సంవత్సరంలోనే ధర్మవరం డివిజన్లో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగింది అని తమ తోటి ఉద్యోగులే చెబుతూ వారి వద్ద ప్రశంసలు కూడా అందుకున్నారు. దీన్నిబట్టి చూస్తే పేదరికానికి చదువు అడ్డంకి కాదు అని ఆర్డిఓ మహేష్ నిరూపించారు. అందుకే తన రెవెన్యూ డివిజన్లోని నూతనంగా చేరిన ఉద్యోగులకు, విధుల విషయంలో ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ, పలు సూచనలతో రెవెన్యూ డివిజన్ ను శ్రీ సత్య సాయి జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చేందుకు వారు విశేష కృషి చేయడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు