Homeభారత్‌పై ట్రంప్‌ సుంకం పిడుగు

భారత్‌పై ట్రంప్‌ సుంకం పిడుగు

- Advertisement -

వాషింగ్టన్‌/భారత్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై బాంబు పేల్చారు. సుంకాల మోత మోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ మెతక వైఖరి కారణంగా ఏకంగా 25 శాతం సుంకాలు పెంచడమే కాకుండా రష్యాతో వాణిజ్యం నడుపు తున్నారంటూ అదనంగా జరిమానా విధించారు. భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేసినందుకు అదనంగా జరిమానా కూడా విధించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఏప్రిల్‌ 2న ట్రంప్‌ ప్రకటించిన 26 శాతం సుంకాల్లో ఒక శాతం తగ్గించి… 25 శాతానికి అంగీకరించారు. ‘భారత్‌ మిత్రదేశమే కానీ అమెరికా వస్తువులపై ఎక్కువ సుంకాలు విధిస్తోంది. అందుకే ఆ దేశంతో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం’ అని ట్రంప్‌ వెల్లడిరచారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. వాణిజ్యపరంగా అడ్డంకులు కూడా ఇక్కడ ఎక్కువేనని ‘ట్రూత్‌’లో పేర్కొన్నారు. రష్యాతో భారత్‌ వాణిజ్యంపై అక్కసు వెళ్లగక్కారు. భారీగా సైనిక సామగ్రిని భారత్‌ కొనుగోలు చేస్తోందని, రష్యా నుంచి భారత్‌తో పాటు చైనా కూడా చమురు దిగుమతి చేసుకుంటోందని ట్రంప్‌ వెల్లడిరచారు. ప్రపంచమంతా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలని పిలుపునిస్తుంటే… ఈ దేశం రష్యా నుంచి కొనుగోళ్లు సాగిస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ చర్యల దృష్ట్యా భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నామని, ఆగస్టు 1 నుంచి ఇవి అమలవుతాయి’ అని ట్రంప్‌ వెల్లడిరచారు. ప్రతీకార సుంకాల గడువు ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశాన్ని ప్రధాని మోదీ అమెరికా పర్యటనప్పుడే వ్యక్తం చేసినాగానీ అనుకున్న విధంగా మధ్యంతర ఒప్పందం కుదరలేదు. రెండు దేశాల అధికారుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారత్‌లో పర్యటించనున్న క్రమంలో ఆరో దఫా చర్చలు జరుగుతాయి. అయితే వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదు కాబట్టి భారత్‌పై 2025 శాతం సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌ మంగళవారం సంకేతాలిచ్చారు. ఆగస్టు 1 నుంచి అమెరికా విధించే సుంకాలన్నీ తాత్కాలికమేనని, వాణిజ్య ఒప్పందం ఖరారైన తర్వాత పరిస్థితి మారుతుందని భారతీయ అధికార వర్గాలు వెల్లడిరచాయి. అమెరికా ఉత్పత్తుల కోసం తమ మార్కెట్ల ద్వారాలు తెరవాలంటూ భారత్‌కు ట్రంప్‌ పదేపదే పిలుపునిచ్చారు. అయితే వ్యవసాయండెయిరీ రంగాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరక ఒప్పందం ఖరారు కాలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు