Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్నఇద్దరు అరెస్టు

ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్నఇద్దరు అరెస్టు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి రాబడిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్న ఉత్తర్ ప్రదేశ్ నివాసి సాజాద్ హుస్సైన్ , మహారాష్ట్ర నివాసి తౌఫీక్ ఆలం షేక్ లను ధర్మవరము పోలీసులు ఈనెల 16వ తేదీన అరెస్టు చేసినట్లు శ్రీ సత్య సాయి జిల్లా యస్.పి. సతీష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారము జిల్లా పోలీసు కార్యలయం లోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో ఈ కేసు వివరాలను మీడియా కు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ
కోత్వాల్ నూర్ మొహమ్మద్ ధర్మవరం నివసిస్తూ పాకిస్తాన్-ఐ ఎస్ ఐ ఆధారిత జైష్‌-ఎ-మొహమ్మద్ (జేఈఎం) కు చెందిన పలువురు వాట్సాప్ గ్రూప్‌లలో సభ్యుడిగా ఉండేవాడు అని తెలిపారు. భారతీయ భూభాగం లో రాడికల్/జిహాది కార్యకలాపాలలో పనిచేసినాడు అని తెలిపారు. పాకిస్తాన్‌లోని జిహాది కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండి భారతదేశం వ్యతిరేక చర్యలు చేపట్టే యత్నాలు చేయడం జరిగిందన్నారు.
మరింత దర్యాప్తులో, ఇంటెలిజెన్స్ సమాచారంపై ఆధారపడి, మరొక ఇద్దరు జిహాది సభ్యులను గుర్తించడం జరిగిందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి సాజాద్ హుస్సైన్, మహారాష్ట్ర నుండి తౌఫీక్ అలామ్ షేక్ లను ఈ నెల 13వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ బృందాలు, ఉత్తర్ ప్రదేశ్ పోలీస్‌ల సహకారంతో అమ్రోహా లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సాజాద్ హుస్సైన్ (ఏ2) ను అరెస్టు చేయడం జరిగిందన్నారు., అతను జమా మదరాసలో అలిం కోర్సు చేస్తున్నారు అని,అతని వద్ద నుండి ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ , జిహాది మెటీరియల్ స్వాధీనము చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా
తనిఖీలో భాగంగా జంపర్వా లోని సజాద్ హుస్సైన్ నివాసం ఉంటున్న ఇంటి నుండి ఒక సింగిల్ బారెల్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకోవడమైనది అని తెలిపారు. ఇది అతని బంధువుది అని, సదరు ఆయుధంను జిహాదీ కార్యా క్రమాలను ఉపయోగించేవారని వారు తెలిపారు. ఈనెల 13వ తేదీన ఏపీ పోలీస్, మహారాష్ట్ర ఏ టి ఎస్ బృందాలు రైడ్‌లు నిర్వహించి, తౌఫీక్ ఆలమ్ షేక్ (ఏ3) ను నాసిక్‌, మ‌లేగావుల్లో అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్టు సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాది మెటీరియల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్న జైష్-ఎ ఆధారిత వాట్సాప్ గ్రూప్‌లు, చానల్స్‌లలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారని తెలిపారు. వీరు జేఈఎం ఆపరేటర్లతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, యువతను జిహాది కోసం రాడికలైజ్ చేస్తూ, వారు పాకిస్తాన్‌లో మిలటరీ శిక్షణ తీసుకొని భారతదేశం పై యుద్ధం చేయాలని యోజన చేయడం జరిగిందన్నారు.
ఇద్దరు ముద్దాయి లను అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానాల్లో హాజరు పరచిన అనంతరము ట్రాన్సిట్ వారంట్లపై వారిని ధర్మవరంకు తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో సంబంధిత న్యాయస్థానాల్లో జడీషియల్ రిమాండ్ కోసం కు పంపడం జరుగుతుందన్నారు.
భారత దేశం లో నిషేదిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (బి ఎఫ్ ఐ) ఇంకా వీటి యొక్క ప్రతినిధులు ఇంకా ఇతర నిషేదిత సంస్థలతో సంబంధాలు పెట్టుకుని, సామాజిక సేవ పేరుతో ఉగ్రవాద (జిహాది) కార్యాకలాపాలను సాగిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ముస్లిం యువతను ఉగ్రవాదులుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని తెలిపారు. ఎవరైనా ఈ రకమైన నిషేదిత సోషల్ మీడియా గ్రూప్‌లతో, పాకిస్తాన్ ఐ ఎస్ ఐ హ్యాండ్డర్స్ జిహాదీ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లైతే, వారిని దేశ వ్యతిరేక/ఉగ్రవాద కార్యకలాపంగా భావించి యూఏపి చట్టం , ఇతర సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ విభాగం పాక్ ఆధారిత సోషల్ మీడియా గ్రూప్‌లపై గట్టి నిఘా ఉంచామని, ముఖ్యంగా ముస్లిం యువత ఈ రకమైన మత ఛాందసమైన విషయాల పై వచ్చే సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సామాజిక మాధ్యమాలలో ఏమైనా సందేహాస్పద కార్యకలాపాలు లేదా ఆన్‌లైన్ కంటెంట్ భారత దేశ వ్యతిరేక లేదా రాడికలైజ్ భావాలను ప్రోత్సహిస్తే వెంటనే పోలీస్‌లకు సమాచారమివ్వాలని తెలిపారు. అంతే గాక రాష్ట్రీయ భద్రత, ప్రజల భద్రత పరిరక్షణ మన అందరి బాధ్యత అని వారు స్పష్టం చేశారు. ఈ ముద్దాయి ల ద్వారా సింగిల్ బారెల్ రైఫిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.సజ్జాద్ హుస్సైన్ (ఏ2) – అమ్రోహా, జంపర్వా, సున్సారి, ఖేరి, ఉ. ప్ర.
తౌఫీక్అల్ అలామ్ షేక్ (ఏ3) – నాసిక్, మలేగావ్, మహారాష్ట్ర అరెస్టు చేయడం జరిగిందన్నారు.
ఈ కేసును ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలోని రెండు బృందాలను ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అభినందించారు.ఈ సమావేశంలో ఎస్పీ తో పాటు ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్, ఎస్బి సిఐ వెంకటేశ్వర్లు, ముదిగుబ్బ సిఐ శివ రాముడు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు