Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

- Advertisement -

రిషి విద్యాలయ ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఋషి విద్యాలయంలో ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలలో భాగంగా, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ స్వరూ కిరణ్ స్వరూప సింగ్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి త్రీ మోడల్ లో శిశు కేంద్రీకృత విద్యాబోధనను అందిస్తూ, వ్యక్తంకర ,వ్యక్తం తగ్గత భేదాలను గుర్తిస్తూ వినూత్న బోధన చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక ను వెలికి తీయించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ శిక్షణా తరగతులను నిర్వహిస్తూ మరింత మెరుగైన విద్యను అందించడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఏఓ రవీంద్ర, ఏవో రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు