విశాలాంధ్ర -ధర్మవరం; ప్రపంచ ఆహార దినోత్సవమును పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శన గావించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి పాఠశాల డైరెక్టర్లు శెట్టిపి పద్మ ,శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు జింక్ ఫుడ్స్ కు దూరంగా ఉండవలెనని, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా 2025 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నినాదం “మెరుగైన ఆహారాలు, మెరుగైన భవిష్యత్తు కోసం చేతులు కలపండి “అనే నినాదాన్ని అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు.. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫుడ్ స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కాకతీయ విద్యా నికేతన్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


