Saturday, March 7, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లామహిళ హత్య మిస్టరీ ఛేదించేందుకు రెండు బృందాలు

మహిళ హత్య మిస్టరీ ఛేదించేందుకు రెండు బృందాలు

- Advertisement -

విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసాని నగర్ వెనుక ఉన్న డ్రెయిన్ లో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మహిళ మృత దేహం కేసులో మిస్టరీని ఛేదించేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం డ్రెయిన్ లో గుర్తు తెలియని మహిళ తల, కాళ్లు, చేతులు, నడుము భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి పడేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీపీ రాజశేఖర బాబు సీరియస్ గా తీసుకుని వెంటనే ఛేదించేలా రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఇటీవల నమోదైన మహిళల మిస్సింగ్ కేసులు పరిశీలించడంతోపాటు ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో విచారణ చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు