HomeజాతీయంUGC NET : ప్రతి ప్రశ్నకు రూ.200 ఎందుకు? యూజీసీ నెట్ ఆన్సర్ కీపై NTA...

UGC NET : ప్రతి ప్రశ్నకు రూ.200 ఎందుకు? యూజీసీ నెట్ ఆన్సర్ కీపై NTA వివరణ

- Advertisement -

యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది.దీనిపై అభ్యర్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాల్సి రావడంతో తమపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫీజుపై ఎన్‌టీఏ స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణులు పరిశీలిస్తారని తెలిపింది.ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తప్పుగా ఉందని అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తే.. నిపుణులు దానిని పూర్తిగా పరిశీలిస్తారని పేర్కొంది.

అభ్యంతరం సరైనదిగా తేలితే కీ సవరణ
అభ్యర్థి చేసిన అభ్యంతరం సరైనదిగా నిపుణుల పరిశీలనలో తేలితే ఆన్సర్ కీని సవరించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.సవరించిన సమాధానం ఆ ప్రశ్నను రాసిన విద్యార్థులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.అంటే ఒక అభ్యర్థి చేసిన సరైన ఛాలెంజ్ కారణంగా ఆన్సర్ కీ మారితే.. ఆ మార్పు సంబంధిత పరీక్ష రాసిన అందరికీ వర్తిస్తుంది.అదే సమయంలో అభ్యర్థి చేసిన అభ్యంతరం సరైనదని నిర్ధారణ అయితే.. ఆ ప్రశ్నకు ఛాలెంజ్ చేసేందుకు చెల్లించిన రూ.200 మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ఎన్‌టీఏ తెలిపింది.కాబట్టి సరైన అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు ఫీజు భారం ఉండదని స్పష్టం చేసింది.

అర్థంలేని అభ్యంతరాలను నియంత్రించేందుకే..
ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజు నిర్ణయించడానికి ప్రధాన కారణం అర్థంలేని లేదా ఆధారాలు లేని అభ్యంతరాలను నియంత్రించడమేనని ఎన్‌టీఏ పేర్కొంది.అభ్యర్థులు ఏ ప్రశ్నపై పడితే ఆ ప్రశ్నపై అనవసరంగా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఉండేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లు వివరించింది.ఈ ఫీజు ద్వారా లాభం పొందాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది.”ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ఆన్సర్ కీ ఛాలెంజ్ విధానాన్ని రూపొందించాం. అభ్యర్థి చేసే అభ్యంతరాన్ని సబ్జెక్ట్ నిపుణులు పరిశీలిస్తారు. అది సరైనదని తేలితే ఆన్సర్ కీని సవరించడంతో పాటు.. ఆ ప్రశ్నకు చెల్లించిన ఛాలెంజ్ ఫీజును రీఫండ్ చేస్తాం” అని ఎన్‌టీఏ తెలిపింది.

CSIR-UGC NET ప్రాథమిక కీ విడుదల
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు,పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన CSIR-UGC NETకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఎన్‌టీఏ ఇటీవల విడుదల చేసింది.ఈ కీలో ఏదైనా సమాధానం తప్పుగా ఉందని అభ్యర్థులు భావిస్తే.. ప్రతి ప్రశ్నకు రూ.200 చెల్లించి తమ అభ్యంతరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించారు.

అయితే ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో వివిధ రకాల లోపాలు ఉన్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.ఈ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ మూడు సబ్జెక్టులకు సెప్టెంబరులో మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు