Homeఅంతర్జాతీయంభారతీయ కంపెనీ, సీఈఓపై అమెరికా ఆంక్షలు

భారతీయ కంపెనీ, సీఈఓపై అమెరికా ఆంక్షలు

- Advertisement -

సుడాన్‌లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణ
వాషింగ్టన్:
సుడాన్‌లో అంతర్యుద్ధాలను ప్రేరేపిస్తున్నారనే నెపంతో అమెరికా ఒక భారతీయ కంపెనీ సహా పలు సంస్థలు, ఎనిమిది మంది వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు చెందిన ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ వెల్లడించింది. సూడాన్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణ తీవ్రతరం కావడానికి ఈ సంస్థలు కారణమవుతున్నాయని ఆరోపించింది. కొన్నేళ్లుగా ఈ రెండు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలతో సుడాన్‌లో అంతర్యుద్ధం నడుస్తోంది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం ఏర్పడింది. ఆంక్షలు ఎదుర్కొంటున్నవారిలో రాయ్‌పుర్‌కు చెందిన అలోక్ చౌధరీ ఒకరు. అతడు ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌కు సీఈఓగా ఉన్నారు. దీనికి మరోపేరు అమిన్ ఎక్స్‌ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్‌ఏఎఫ్‌కు చెందిన ఆయుధగారాన్ని నిర్వహించే సంస్థకు అమిన్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ పేలుడు పదార్థాలున్న 200 షిప్‌మెంట్లను సప్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌తో పాటు సుడాన్, ఈజిప్ట్ కేంద్రంగా నడుస్తోన్న సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ‘ఈ సంస్థలు సుడాన్ దళాలకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విదేశీ ఫైటర్లను సరఫరా చేస్తుండటంతో ఘర్షణ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. దీంతో మానవతా సంక్షోభం ఏర్పడుతోంది. ఉగ్రవాద గ్రూపులు చెలరేగడానికి అవకాశం ఏర్పడింది’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగాట్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు