Friday, January 16, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉద్యోగ, ఉపాధ్యాయుల పి ఆర్ సి, డి ఎ, ఆర్థిక బకాయిలకై యూటీఎఫ్ డిమాండ్

ఉద్యోగ, ఉపాధ్యాయుల పి ఆర్ సి, డి ఎ, ఆర్థిక బకాయిలకై యూటీఎఫ్ డిమాండ్

- Advertisement -

– యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; 12 వ పి ఆర్ సి. అమలు, బకాయి బడ్డ డి ఏ లు. ఇతర ఆర్థిక బకాయిలు సత్వరమే విడుదల కొరకై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయం నందు ధర్మవరం జోన్ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఒకవేళ కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు 30 శాతము మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న డి. ఏ . లను విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు.
మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004 కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామకృష్ణ నాయక్, ధర్మవరం జోన్ నాయకులు ఆంజనేయులు, రామాంజనేయులు, సాయి గణేష్, వెంకట కిషోర్, రిటైర్డ్ పెన్షనర్స్ నాయకులు హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు