రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని లయోలా ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యసన వర్గ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ యుఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీ యుఎస్ సంఘం నిరంతరం పోరాడుతూ జాతీయ సమైక్యత కొరకు పని చేస్తుందని తెలిపారు. బదిలీ కౌన్సిలింగ్లో ఎస్జీ టీచర్స్ కొరకు మానువల్ కౌన్సిలింగ్ కోసం పోరాటం చేసిందని తెలిపారు. అదేవిధంగా మినిమం టైం స్కేల్, ఉపాధ్యాయులకు సర్వీస్, సర్వీస్ రిజిస్టర్స్ ను ప్రారంభం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను వెంటనే ప్రకటించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాల అధ్యక్షులు అమర చంద్రబాబు, కళ్యాణి, కార్యదర్శులు సురేష్, ఎర్రి స్వామి, రాష్ట్ర కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, భాస్కరయ్య, వెంకటేశ్వర ప్రసాద్, అన్నం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఏపీ ఉపాధ్యాయ సంఘం అభ్యసన వర్గ…
- Advertisement -
RELATED ARTICLES


