- Advertisement -
ఆడహక్కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణ శాలకు ఫ్లోరింగ్ కొరకు రైస్ మిల్ అధినేత గంగిరెడ్డి దంపతులు ఒక లక్ష రూపాయల నగదును అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్కు అందజేశారు. అనంతరం దంపతుల పేరిటన అర్చకులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించిన తర్వాత ఘనంగా సన్మానించారు. తదుపరి ఆలయం కమిటీ తరఫున దంపతులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పాల్గొన్నారు.


