క్లబ్బు ఇన్స్టాలేషన్ ఆఫీసర్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ గోపా నర్సింలు
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల అంధత్వ నిర్మూలనే లయన్స్ క్లబ్ లక్ష్యము అని క్లబ్బు ఇన్స్టాలేషన్ ఆఫీసర్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ గోపా నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట లో గల లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో 2025 -26 సంవత్సరమునకు గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్థాయిలోనే లయన్స్ క్లబ్ విశేష సేవలు అందిస్తూ లక్షల మందికి అందత్వాన్ని తొలగించి కంటి వెలుగును ప్రసాదించడం జరిగిందన్నారు. ఈ నూతన కమిటీ ఈ సంవత్సరంలో లయన్స్ క్లబ్ ను మరింత అభివృద్ధి బాటలో నడుపుతూ పేద ప్రజలకు, సమాజానికి వివిధ రకాల సేవలను అందించాలని వారు తెలిపారు. అనంతరం నూతన కమిటీని ప్రకటిస్తూ అధ్యక్షులుగా ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శిగా ఉలవల నాగేంద్ర, కోశాధికారిగా కొత్తపాలెం వెంకటేష్ కుమార్ ప్రకటిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత కమిటీ లయన్స్ వారు ఈ నూతన కమిటీకి పూర్తి సహకారం అందిస్తూ, సహాయ సహకారాలు, సలహాలు ఇస్తూ భవిష్యత్తులో లయన్స్ క్లబ్ సేవలను పేద ప్రజలకు, సమాజానికి అందించాలని వారు కోరారు. అనంతరం నూతన కమిటీచే ప్రతిజ్ఞను చేయించారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి పరీక్షలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను కూడా తాము నిర్వహించి లయన్స్ క్లబ్ అభివృద్ధికి పాటు పడతామని తెలిపారు. అనంతరం నూతన కమిటీని బంధుమిత్రులు, లయన్స్ క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. సభ అధ్యక్షులుగా వేణుగోపాలాచార్యులు, సభ నిర్వహణ గా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు వెంకటస్వామి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పల్లెం వేణుగోపాల్, రాజీవ్ నేత, గూడూరు మోహన్ దాస్, గోసే రాధాకృష్ణ, ఉట్టి శివప్రసాద్, సాగా సురేష్, చందా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల అంధత్వ నిర్మూలనే లయన్స్ క్లబ్ లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


