రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయ్ భాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ కలవల మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలిలో శిబిరానికి సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం భర్త కలవల మురళీధర్, కుమారుడు కలవల నాగతేజ, కోడలు కలవల శర్వాణి, మనవళ్లు మీహాన్ దిశాన్ (సుకన్య సిల్క్స్ ధర్మవరం) వ్యవహరించడం జరిగిందన్నారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహాయ సహకారములతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కంటి పరీక్షల కొరకు వచ్చువారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులలో ఏదైనా రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు, సెల్ నెంబర్ చిరునామాతో రావాలని తెలిపారు. బీపీ, షుగరు ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని వస్తే చికిత్సలతో పాటు ఆపరేషన్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, శోళీ గాళ్ళ వెంకటేశులు, రత్న శేఖర్ రెడ్డి, రమేష్ బాబు, శివయ్య, కొండయ్య, శ్రీనివాస్ రెడ్డి, బండారు వెంకటాచలం, సుదర్శన్ గుప్తా, పెద్దిరెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్బు సుమలత, లక్ష్మి ,భాగ్యలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


