Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఏర్పాటు..

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ ఏర్పాటు..

- Advertisement -

చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోమియో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీని చైర్మన్ తల్లం నారాయణమూర్తి అధ్యక్షతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర కమిటీ చైర్మన్- కడప – రామచంద్రారెడ్డి, డైరెక్టర్లు రాటాల గోపి రామానుజుల రెడ్డి, అనంతపురం నుండి మానవతా చైర్మన్ శీలా జయరామప్ప పాల్గొన్నారు. నూతన కమిటీలో అధ్యక్షులుగా జగ్గా వేణుగోపాల్, కార్యదర్శిగా కోనాపురం సాయి ప్రసాద్, కోశాధికారిగా చల్లా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా మంజునాథ్, సంయుక్త కార్యదర్శిగా తాడిమర్రి రామకృష్ణయ్య, డైరెక్టర్ గాజుల సోమేశ్వర్ రెడ్డి, రాంప్రసాద్ నారాయణమ్మ ఆంజనేయ చౌదరిని ఎంపిక చేయడం జరిగింది అని తెలిపారు. అనంతరం వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి సంస్థ ఆశయాలు ఆచరించవలసిన పద్ధతులు గూర్చి వివరించారు. అధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయాలని మరిన్ని సేవా కార్యక్రమాలను ధర్మవరంలో చేపట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 130 మందికి పైగా సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరు కావడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు