యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలో ఎంతో సంతృప్తి ఉంది అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరా, కోశాధికారి వంకదారి మోహన్, క్యాంపు చైర్మన్ చాంద్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నామని, ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగుళూరు వారి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు పూజారి లక్ష్మీదేవి, కీర్తిశేషులు పూజారి వెంకటరాముడు జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు (విమలా సారీస్) వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 78 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 408 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరందరికీ డాక్టర్ వర్షా మరియు వైద్య సిబ్బందిచే బెంగళూరులో ఉచిత ఆపరేషన్, ఉచిత వసతి, ఉచిత రవాణా ఖర్చు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దాత పూజారి జగదీష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సి రాధాకృష్ణ, కౌన్సిలర్ కేత లోకేష్, సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, వైకే శ్రీనివాసులు, పోలా ప్రభాకర్, షేక్ సికిందర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలో ఎంతో సంతృప్తి ఉంది..
- Advertisement -
RELATED ARTICLES


