విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే విద్యార్థి, యువజన నాయకులపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు నమోదు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని విద్యార్థి యువజన సంఘ నాయకులు విమర్శించారు శుక్రవారం విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్- ఏఐవైఎఫ్ నాయకుల పై పెట్టిన రౌడీ షీటర్, కడపలో మరి కొంతమంది ప్రజా సంఘ నాయకులపై పెట్టిన పిడి యాక్ట్ ఎత్తివేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉరితాళ్ళు మెడలో వేసుకుని నల్ల జెండాలతో , చేతులకు సంకెళ్లతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షలు సోమన్న, వైయస్సార్ యువజన విభాగం జిల్లా అధ్యక్షలు శివారెడ్డి, వైయస్సార్ విద్యార్థి సంఘ నాయకులు రెడ్డి పోగు ప్రశాంత్, పి డి ఎస్ యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షలు మహేంద్ర లు పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల వాగ్దానాల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాలు అడిగితే అక్రమ కేసులు పెట్టడం, ఉద్యమాలను అణిచివేయడం దుర్మార్గమైన పాలనకు నిదర్శనం.ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి వారి వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రశ్నించే గొంతుకలైన విద్యార్థి యువజన సంఘ నాయకులను అణిచే ప్రయత్నాలు ఆపాలి వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉద్యమాల కేసులు,అన్ని అక్రమ కేసులు, రౌడీషీట్లు వెంటనే ఎత్తివేయాలి, డిమాండ్ చేశారు, అలా కాకుండా అధికారం మా చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రశ్నించే గొంతుకలను అణచి వెయ్యాలని చూస్తే విద్యార్థి యువజన సంఘాలుగా గ్రామస్థాయి నుండి రాష్ట్రవ్యాప్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అప్పుడు విద్యార్థులను నిరుద్యోగులను అరెస్టులు చేయడానికి రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవని వారు హెచ్చరించారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష నాగరాజు, బిసన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ కుమార్, నగర కార్యదర్శి అశోక్, పిడిఎస్ యు జిల్లా నాయకులు మునిస్వామి, వైయస్సార్ యువజన విభాగం జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, నజీర్ అహ్మద్, మధుసూదన్ రెడ్డి సాయి, వైయస్సార్ విద్యార్థి సంఘ నాయకులు గౌతమ్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షలు హనోక్, నగర నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థిద్యార్థి,యువజన నాయకులపై అక్రమ కేసులు, రౌడీషీట్లుఎత్తివేయాలి :విద్యార్థి,యువజన సంఘాలు
- Advertisement -
RELATED ARTICLES


