Homeజిల్లాలుఅనంతపురంపండుగ పూట... నీటి కష్టాలు!

పండుగ పూట… నీటి కష్టాలు!

- Advertisement -

విశాలాంధ్ర, బొమ్మనహాళ్:మండలంలోని కళ్ళు దేవనహళ్లి గ్రామంలో పండుగ ఉత్సాహం కన్నా తాగునీటి కష్టాలే ఎక్కువయ్యాయి. గత నాలుగు రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గజగౌరీ దేవి ఉత్సవాల సందర్భంగా బంధువులు, అతిథులు గ్రామానికి పెద్ద ఎత్తున వచ్చినా, నీటి కోసం హగరీ, వేదావతి నదుల వద్దకు ఏద్దుల బండ్లతో వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య పై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని వారు తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి తాగునీటి సరఫరా కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు