ఉరవకొండ (విశాలాంధ్ర):ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు అందజేస్తున్న రేషన్ బియ్యం కొందరి జేబులు నింపుతోంది. ఉరవకొండ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ మాఫియా ముఠాలు చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.లబ్ధిదారుల వద్ద నుండి ఒక్క కిలో బియ్యాన్ని రూ.10 నుండి రూ.14కు కొనుగోలు చేసి, మార్కెట్లో రూ.20–25 వరకు విక్రయిస్తూ మాఫియా సభ్యులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని సమాచారం. ప్రతినెల లక్షల రూపాయలు వసూలవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ముఠాలు గ్రామాల వారీగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని, పగటిపూట మహిళల ద్వారా బియ్యం సేకరించి, రాత్రివేళల్లో ఆటోల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. బియ్యం తరలింపులో కొందరు అధికారులు కూడా మౌనంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేదల పొట్ట నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి చెడ్డ పేరు తెస్తూ సబ్సిడీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, ఉరవకొండ మండలంలో మాత్రం అక్రమ రవాణా ఆగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బ్లాక్ మర్కెట్‌లోకి రేషన్ బియ్యం.. అధికారుల మౌనం.. ప్రజల్లో ఆగ్రహం
- Advertisement -
RELATED ARTICLES


