చమురు రేట్లపై చేతులెత్తేసిన కేంద్రం
న్యూదిల్లీ: అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగిరానున్నాయి. దీనితో దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని ఎదురు చూసిన భారతీయులకు నిరాశ ఎదురయింది. ముడి చమురు ధరలు తగ్గినా… భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ ఇటీవల ఇంధన ధరలు పెంచడంపై గురువారం మాట్లాడారు. లీటరుకు దాదాపు రూ.3.94 మాత్రమే పెంచామన్నారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఆ పెంపును వెంటనే తగ్గించలేమన్నారు. హోర్మూజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ… ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. ఇలా పలు అంశాల వల్ల ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని తేల్చేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలోని చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. ఆ సమయంలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదన్నారు. దీంతో ఆ భారమంతా కేంద్రంపై పడిందన్నారు.
ఇంధన ధరలు ఇప్పుడే తగ్గించలేం
- Advertisement -
RELATED ARTICLES


