– బీఎస్పీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యను వ్యాపారంగా మార్చే ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామని డిఎస్పి పార్టీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్, డెంటల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు మరోసారి భారీగా ఫీజులు పెంచిన తీరు పూర్తిగా అన్యాయం అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ ఫీజుల పెంపు విద్యార్థులపై చేసిన దాడి, ఇది విద్యా మాఫియాలకు లొంగిన ప్రభుత్వం చేసిన అక్రమ నిర్ణయం అని,ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ పైన తీవ్ర విమర్శలు కురిపించారు. ముఖ్యమంత్రి పేదల సంక్షేమం గురించి గొప్పలు చెబుతూ, మరోవైపు ఈ విధంగా విద్యను అమ్మకానికి పెట్టడం ద్వంద్వ నీతికి పరాకాష్ట అని, ఉప ముఖ్యమంత్రి గ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరమన్నారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్పొరేట్ వైద్య కాలేజీల యాజమాన్యాలకు మద్దతుగా నిలబడి, ఫీజుల పెంపును ఆమోదించడం అత్యంత ఘోరం , బాధ్యతా రాహిత్యమన్నారు.
ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలపై మళ్లీ భారం మోపడం అమానుషం అని తెలిపారు. ఇప్పటికైనా
ప్రభుత్వం వెంటనే ఈ దుష్ట నిర్ణయాన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ భారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రాఘవంపల్లి సాకే హరి కుమార్, ఎస్వి జన సంఘం రాష్ట్ర కార్యదర్శి గుడిగళ్ల ధను, బత్తలపల్లి మండల అధ్యక్షుడు గుమ్మలకుంట అమర్నాథ్, పట్టణ కార్యదర్శి మల్లెపూల మళ్ళీ, సాకే విజయ్ కుమార్, సాయి కుమార్, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యను వ్యాపారంగా మార్చడంను ఖండిస్తున్నాం
- Advertisement -
RELATED ARTICLES


