Homeఅంతర్జాతీయంచైనాతో మాకు ప్రమాదం: డొనాల్డ్ ట్రంప్

చైనాతో మాకు ప్రమాదం: డొనాల్డ్ ట్రంప్

- Advertisement -

మా ఓటర్ల జాబితా విదేశీయుల చేతుల్లో ఉందంటూ ఆరోపణ
వాషింగ్టన్:
ఇతరులపై, ఇతర దేశాలపై ఆరోపణలు, నిందలు వేయడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పరిపాటి. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరినో ఒకరిని నిందిస్తుంటారు. తాజాగా చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర పన్నిందని, భారీ డేటా చౌర్యానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. 2020లో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక 22 కోట్ల మంది అమెరికా ఓటర్ల వివరాలు దొంగలించిందన్నారు. ఇందుకు సంబంధించి యూఎస్ ఇంటెలిజెన్స్‌ అసెస్మెంట్లు, నివేదికలు బహిర్గతం చేస్తున్నామని పేర్కొంటూ వైట్‌హౌస్ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మా దేశ ఎన్నికల ప్రక్రియకు చైనా వల్ల ప్రమాదం ఉంది. అమెరికాలో డెమోక్రట్లు ఉన్న రాష్ట్రాల్ల్లో విదేశీయులు లక్షల సంఖ్యలో అక్రమంగా రిజిస్టర్ అయ్యారు. మా ఓటర్ల జాబితా విదేశీ ప్రభుత్వాల చేతుల్లో ఉంది. చైనాతో పాటు రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారం అందింది. మా ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థమవుతోంది. మా ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ కౌంటింగ్ ప్రమాదంలో ఉన్నాయి. ఓటరు ఐడీ, పౌరసత్వ నిరూపణ పత్రాలు లేకుండానే ఓటు వేస్తున్నారు. తపాల ద్వారా కోట్ల మంది ఓటర్లు అక్రమంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా సంస్కరణలు అవసరం. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం. ఓటరు నమోదులో పౌరసత్వ పత్రాలు చూపించడం తప్పనిసరి చేయాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇతరుల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం: చైనా
ట్రంప్ ఆరోపణలపై చైనా స్పందించింది. ఆ దేశ ఎన్నికలతో మాకేంపని అంటూ పేర్కొంది. అమెరికా ఎన్నికల్లో తాము ఎన్నడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోమని చైనా వెల్లడించింది. ఈ మేరకు చైనా దౌత్యకార్యలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి చైనా ఆది నుంచి కట్టుబడి ఉంది. అమెరికా ఎన్నికలు ఆ దేశ అంతర్గత విషయం. వాటి ఫలితాన్ని ఆ దేశ ఓటర్లు నిర్ణయిస్తారు’ అని స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు