తెహ్రాన్ : పశ్చిమాసియాలో ఉదృత వాతావరణం కొనసాగుతోంది. రోజురోజుకు ఘర్షణ తీవ్ర రూపం దాల్చుతోంది. దీనితో ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతూ ఉండగా… ఇప్పుడు ఇరాన్ మరో బాంబు పేల్చింది. హార్ముజ్ జల సంధి మూసివేసామని, నౌకలు దాని గుండా రావడానికి ప్రయత్నిస్తే కాల్చి పడేస్తామని హెచ్చరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. ప్రపంచ ఇంధనానికి హర్ముజ్ జీవనాడి వంటిది. ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు ముడిచమురు… కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. కాగా.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీంనేత ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హర్ముజ్‌ను మూసివేసినట్లు ప్రకటించింది. డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం.. సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హర్ముజ్ నుంచి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు హర్ముజ్ తూర్పువైపున 60 ట్యాంకర్లు వేచిచూస్తున్నాయి.
హార్ముజ్ జలసంధిని మూసేశాం : ఇరాన్
- Advertisement -
RELATED ARTICLES


