క్రీడలు: ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ల దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసేయడంతో సింధు శనివారం నుంచి దుబాయ్‌లోనే చిక్కుకుపోయింది. దీంతో ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు అనుమానంగా మారింది. దీంతో సింధుకు మంగళవారం ప్రారంభమయ్యే ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిణామాల్ని నిశితంగా గమనిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (WFI).. ప్రయాణ ఆటంకాల కారణంగా క్రీడాకారులు ఆలస్యంగా వస్తే షెడ్యూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సింధు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొనడంతో స్టార్ క్రీడాకారులు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలపై భారత్ ఆశలు పెట్టుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ షై యుకి (CHINA)తో లక్ష్యసేన్, ఆల్వి ఫర్హాన్ (INDONESIA)తో ఆయుష్ శెట్టి తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో కాంగ్‌షింగ్- ఆరోన్ తాయ్ (MALAYSIA) జంటతో సాత్విక్- చిరాగ్ జోడీ తమ పోరాటాన్ని ప్రారంభించనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చెన్ యుఫెయ్ (CHINA)తో మాళవిక బాన్సోద్, పోర్న్‌పావీ (THAILAND)తో ఉన్నతి హుడా పోటీపడనున్నారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సయాక- అయాకో (జపాన్) జంటతో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో పాంగ్ రాన్- చెంగ్ యిన్ (MALAYSIA)తో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో, టామ్- డెల్‌ర్యూ (FRANCE)తో రోహన్ కపూర్- గద్దె రుత్విక శివాని అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆల్ ఇంగ్లాండ్‌లో ప్రకాశ్ పదుకొణె (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే భారత్ తరఫున టైటిళ్లు సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్యసేన్ రన్నరప్‌గా నిలిచారు.
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నకు సింధు దూరం
- Advertisement -
RELATED ARTICLES


