Homeఆంధ్రప్రదేశ్పర్యావరణ పరిరక్షణలో మేము సైతం

పర్యావరణ పరిరక్షణలో మేము సైతం

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటున్న అర్ కె టెక్నో పాఠశాల విద్యార్థులు. మంగళవారం చినకొండేపూడి గ్రామంలో గల అర్ కె టెక్నో ప్రైవేటు ఉన్నత పాఠశాల విద్యార్థులు కరస్పాండెంట్ కె ప్రసన్నా రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణం పరిరక్షణకు తాము సైతం అంటూ మట్టితో వినాయక విగ్రహాలను చేసి పలువురికి అందించారు. దీనిలో భాగంగానే మట్టి విగ్రహాలు మాత్రమే పూజించి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నా రెడ్డి మాట్లాడుతూ ఎకో గణపతి  ద్వారా పర్యావరణం, పరిరక్షణ అనే నినాదంతో మా విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేశారని మన సాంప్రదాయాలు పండుగలు మనకు ఆనందాన్ని ఇస్తాయి.కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో చేసిన గణపతి విగ్రహాలు నదులను చెరువులను కలిసి కాలుష్యం చేస్తున్నాయి. అందువల్ల పర్యావరణ పరిరక్షించాలి అంటే మట్టి గణపతిని మాత్రమే పూజించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి వెంకటేశ్వరరావు,  హెచ్ ఎమ్  టి రామకృష్ణ ,వి రమాదేవి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు