Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతాం

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతాం

- Advertisement -

ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్

విశాలాంధ్ర ధర్మవరం; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తాము పోరాడుతామని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిపో అధ్యక్షులు గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనల్ కమిటీ పిలుపుమేరకు జోన్వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కడప డిపి టి వో మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడప నందు నిరాహార దీక్షలు జరుగుతున్నాయని, వారికి మద్దతుగా ధర్మవరం డిపో ఆవరణమునందు దీక్షలను కొనసాగించడం జరిగిందని తెలిపారు. ఈ దీక్షలో డ్రైవర్లు బి. గోపాల్, బత్తి నన్నా, ఎం, గోపాల్, ఏం. కదిరప్ప, కండక్టర్లు ఎం రమణప్ప బి ఆథోన్ (కోచ్ బిల్డర్), బి.గోపాల్, ఎం మంజునాథ్, టి. శేషు దీక్షలో పాల్గొనడం జరిగిందని వీరందరికీ మా మద్దతును ప్రకటించడం జరిగిందన్నారు. ప్రమోషన్ ప్రక్రియ వేగవంతం కావాలని, ఉద్యోగ భద్రత 1/19 ను వెంటనే అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఇయర్స్, స్పెషల్ గ్రేడ్లను నిరుపదలు చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. జోనల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తదితర డిమాండ్లను వారు తెలిపారు. ఈ నిరాహార దీక్షలకు జోనల్ వైస్ ప్రెసిడెంట్ నాగ శేఖర్, ఏఎస్. రావు, రీజినల్ చైర్మన్ ముత్యాలప్ప పాల్గొనడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు