Tuesday, July 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడుతాం..

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడుతాం..

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు తాము పెద్ద ఎత్తున పోరాడుతామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు నాగార్జున రెడ్డి , డిపో కార్యదర్శి ముస్తఫా తెలిపారు. అనంతరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై గల వ్యక్తి వీటిని యాజమాన్యం అటు ప్రభుత్వము తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్తో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్లలో పదోన్నతులను వెంటనే అమలు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సొంతముగా కొనుగోలు చేసి ఆర్టీసీ నే వాటిని అమలుపరచాలని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, అదేవిధంగా బస్సుల నిర్వహణ కొరకు డిపో ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకు ఇచ్చే విధానాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. డబుల్ డ్యూటీ చేస్తున్న ఉద్యోగులకు డిడి అమౌంటు వెంటనే పెంచాలని, ఈహెచ్ ద్వారా వైద్య సౌకర్యాలు పాత పద్ధతుల్లోనే వైద్య సౌకర్యాలు అందించాలని, సర్కులర్ నెంబర్ పిడి 1/2019 అమలు చేయుటకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసి అమలు జరిగేలా చూడాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మూవింగ్ యావరేజ్ చెల్లించాలని, కాలం చెల్లిన బస్సులకు బ్రేక్ డౌన్ కు గ్యారేజీ సిబ్బందిని బాధ్యులను చేసి అక్రమంగా పనిష్మెంట్ ఇస్తున్న విధానాన్ని వెంటనే అరికట్టాలని తెలిపారు. 12వ పిఆర్సి కమిషన్ను నియమించి ఎన్నిక ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 18 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనియెడల దశలవారీగా మా పోరాటాలను సంపుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ కార్యదర్శి నరసింహులు, ప్రచార కార్యదర్శి బుల్ల ఆదినారాయణ ,పెద్దక్క అరుణమ్మ, గ్యారేజ్ కార్యదర్శి మల్లికార్జున, సుధాకర్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ లక్ష్మన్న తో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు