మై భారత్ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమమం..
విశాలాంధ్ర ధర్మవరం: భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మైభారత్ మరియు ప్రగతి పధం యూత్ అసోసియేషన్, ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ,ఎన్ ఎస్ ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియం నందు ఏక్ పేడ్ మా కే నామ్ పై యువతకు పెయింటింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై భారత్ ప్రోగ్రాం ఇంచార్జి జీ. శ్రీనివాసులు, మై భారత్ స్టేట్ కో ఆర్డినేటర్ బిసాతి భరత్, ప్రాసిపాల్ జే. వి. సురేష్ బాబు, ఆంగ్ల అధ్యాపకులు వై. రాజేష్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత. కె.జయమారుతి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మల్లికార్జున పాల్గొని వాటి విశిష్టతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవితం లో తల్లి తండ్రి గురువుల మీద భక్తి గౌరవాన్ని కలిగి ఉండాలి , ప్రతి ఒక్కరు తల్లి మీద ప్రేమతో వారి యొక్క ప్రత్యేక రోజులలో ఒక చెట్టు నాటి వాటిని సంరక్షించాలి అని పేర్కొన్నారు. అలాగే రాబోవు కాలంలో వర్ష కాలం వస్తుంది కనుక విరివిగా చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ పుడమితల్లి రుణం తీర్చుకోవడం కోసం మీ యొక్క తల్లి పేరు మీద చెట్లను నాటాలి అని తెలిపారు.అలాగే అతిథుల చేతుల మీదుగా చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా పెయింటింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన యువతకి మెమెంటో, కేంద్రప్రభుత్వంచే జారి చేసిన ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు వంశీ, అధ్యాపకులు, యువతీ యువకులు పాల్గొన్నారు.