హైదరాబాద్: విమర్శలు వస్తున్నాయని ఆగిపోతే అక్కడే ఉంటాం. తాను ఏం చేసినా కొందరు విమర్శిస్తున్నారు. అటువంటి విమర్శలను, అలాంటివారిని పట్టించుకోవడం మానేసినట్లు నిర్మాత నిహారిక చెప్పారు. ఆమె సొంత బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘రాకాస’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీమ్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిహారిక పాల్గొని మాట్లాడుతూ… నిర్మాతగా కెరీర్ ప్రారంభించగానే తనకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు. ‘కమిటీ కుర్రోళ్లుతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశాను. అప్ప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, తెలిసిన వాళ్లతో సినిమాలు చేయచ్చు కదా అన్నారు. ఆ సినిమా సక్సెస్ అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ‘రాకాస’ చేస్తుంటే ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి కథలు చేయచ్చు కదా… ఇలాంటి వీఎఫఎక్స్‌లు ఎందుకు అంటున్నారన్నారు. చిన్నచిన్న వాళ్లతో సినిమాలు చేయచ్చు కదా అని మరికొందరు అన్నారు. నేనేం చేసినా మాటలు అనేవాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటాను. నిర్మాతగా ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. కొణిదెల కుటుంబం నాకు ఎంత ముఖ్యమో నా బ్యానర్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం’ అని నిహారిక అన్నారు. మనం ఏది చేసినా అందరికీ నచ్చకపోవచ్చు. కానీ మనం చేసేది మనకి ముందు నచ్చాలన్నారు. నిర్మాతగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఎంతో నేర్చుకోవాలన్నారు.
విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగుతా: నిహారిక
- Advertisement -


