ఏపీలో సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వృత్తి పనుల వారికి గతంలో సర్వీస్ ఇనాం భూములు కేటాయించారు. లబ్ధిదారులు ఆ భూములను సాగు చేసుకోవడం తప్ప వాటిపై వారికి ఎలాంటి హక్కులు లేవు. ఆ భూములపై వారికి హక్కులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సర్వీస్ ఇనాం భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఎకరాలు ఉండొచ్చని మంత్రి తెలిపారు. నగరాలు, పట్టణాల్లో 40 నుంచి 50 గజాల్లో కట్టుకున్న ఇళ్లలో కొన్ని 22ఏ నిషేధ జాబితాలో ఉన్న విషయంపై మాట్లాడుతూ ఆ సమస్య ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందో ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకురావాలని… తాము పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
సర్వీస్ ఇనాం భూములకు హక్కులు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటాం: ఏపీ మంత్రి అనగాని
RELATED ARTICLES