Homeజాతీయంఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్!

ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్!

- Advertisement -

దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఈ సందర్భంగా పిటిషనర్‌పై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కులగణనను చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చీ, విపుల్ మనుభాయ్ పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ పై మండిపాటు
విచారణ సందర్భంగా పిటిషన్‌లో ఉపయోగించిన భాషపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఁమీరు దాఖలు చేసిన పిటిషన్‌లో అసభ్యకరమైన భాష వాడారు. అసలు ఈ పిటిషన్‌ను ఎవరు తయారు చేశారు?ఁ అని జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా హాజరైన పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ తీవ్రంగా మండిపడ్డారు.
అనంతరం ఆ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఒకే సంతానం ఉన్న కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా అదే ధర్మాసనం తిరస్కరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు