విశాలాంధ్ర – తాళ్లపూడి : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన జిడ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కుమార్తె ఇంటినుండి వెళ్ళి పోయిందని పోలీస్ లకు పిర్యాదు చేసిన 24 గంటల్లోపు తాళ్లపూడి పోలీసులు ఆచూకీ కనుగొన్న వైనమిది. సుబ్రహ్మణ్యం కుమార్తె చదువు మానివేసి ఇంటి దగ్గరే ఉంటూ పనులు చేసుకుంటుండగా, తల్లి దండ్రులు ఖాళీగా ఉంటున్నావని మందలించడంతో ఆమె ఇంటి నుండి పారి పోయింది. ఈ మేరకు తాళ్లపూడి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా తాళ్లపూడి పోలీస్ లు కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల లోపు అమ్మాయి ఆచూకీ కనుగొన్నారు. బంధువులు ఇంటి వద్ద ఉన్న ఆమె ను తీసుకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ, ట్రైనీ ఎస్సై ఆదిత్య శ్రీనివాస్, ఎస్.బి కానిస్టేబుల్ రాజు యాదవ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు సిబ్బంది పనిచేశారు.
పిర్యాదు చేసిన 24 గంటల్లోనే
- Advertisement -
RELATED ARTICLES


