Sunday, November 16, 2025
Homeజిల్లాలుఅనంతపురంపొగాకు కు యువత దూరంగా ఉండాలి

పొగాకు కు యువత దూరంగా ఉండాలి

- Advertisement -

డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవి
విశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి టోభాకో ప్రీ యూత్ కాంపెయిన్ 3.O ను జెండా ఊపి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు గురువారం ప్రారంభించారు. అక్టోబర్ 9 వ తేదీ నుండి డిసెంబర్ 08 వ తేదీ వరకు పొగాకు వ్యతిరేకంగా ప్రజలలో మరియు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించబడునని ఈ సందర్భంగా తెలిపారు. సిగరెట్టు మరియు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని పొగాకు మరియు వాటి ఉత్పత్తులకు దూరంగా ఉంటూ క్యాన్సర్ వంటి భయానిక వ్యాధులు రాకుండా నివారించుకోవాలన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరి చేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాలలో సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని తెలియజేశారు. అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఒ డా. యుగంధర్,పరిపాలన అధికారి గిరిజ మనోహర్ , మలేరియా అధికారి ఓబులు, డెమో సిబ్బంది నాగరాజు, త్యాగరాజు, గంగాధర్ , జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ శ్రీరాములు, ఎన్సీడీ సిబ్బంది ప్రేమ్ జిల్లా ఫ్లో రోసిస్ కన్సల్టెంట్ ఆంజనేయులు ,కిషోర్, శశి, మౌనిక పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు