విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గ్రామానికి చెందిన డోలు రామాంజనేయులుకు 61,500 రూపాయలు, కోసిగి ఈరమ్మకు 25,000 రూపాయల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంజీ నరసన్న,ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బిసి సెల్ మండల నాయకులు తలారి అంజి, కోసిగి సిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న, నాయకులు గౌళ్ల నల్లారెడ్డి, కోడిగుడ్ల లక్ష్మన్న, కంపాడు లక్ష్మన్న, జనసేన నాయకులు మహాదేవ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


