విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నుండి ధర్మవరానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసులు గుర్తుతెలియని దొంగ దొంగలించాడు అని బాధితురాలు జమున తెలిపింది. చెన్నై కొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన రవి నాయక్ భార్య జమున బుధవారం ఉదయం తన కుమార్తెను కళాశాలకు వదిలి పెట్టేందుకు అనంతపురం కు పోవడం జరిగిందని, ఆ తర్వాత అనంతపురంలో ధర్మవరం ఆర్టీసీ బస్సు ఎక్కడ జరిగిందని తలనొప్పిగా ఉందని ఓ టాబ్లెట్ వేసుకొని బస్సులో నిద్రపోయింది అని తెలిపారు. అయితే అనుకోకుండా ధర్మవరం బస్టాండ్ రాగానే మెడలో చైను కనిపించకపోవడంతో లబోదిబోమని ఆమె బాధను వ్యక్తం చేసింది. నా మెడలోని గొలుసు దొంగలించారని ఆర్టీసీ అధికారులకు తెలిపింది. అనంతరం ఆర్టీసీ అధికారులు బస్టాండు లోని వివరాలను పోలీసులకు తెలిపారు. బస్సు పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో దిగగానే నా గొలుసు పోయిందని బాధితురాలు తెలిపింది. తదుపరి జరిగిన సంఘటన వన్ టౌన్ పోలీసులు సమాచారాన్ని సేకరించి ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా అనంతపురం బస్టాండ్ లో తరచూ నిద్రపోయిన వ్యక్తుల సెల్ ఫోన్లు, బ్యాగులు, చివరకు బిచ్చగాళ్ళు దాచుకున్న నగదును కూడా దొంగలు దోచుకుని వెళ్తున్నారు. ఇక్కడ అనగా ఆర్టీసీ బస్టాండ్ లో నైట్ బీట్ తిరగకపోవడంతో ఇటువంటి దొంగతనాలు సాఫీగా జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నైట్ బీట్ ను పటిష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సులో మహిళ మెడ లోని బంగారు గొలుసు చోరీ
- Advertisement -
RELATED ARTICLES


