రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవలతో పాటు కంటి ఉచిత శిబిరాలు కూడా నిర్వహిస్తూ, ఉచితంగా ఆపరేషన్లు, ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. నేటి శిబిరానికి దాతగా కీర్తిశేషులు చింద లూరు పద్మావతి, కీర్తిశేషులు చింద లూరు సత్యనారాయణ జ్ఞాపకార్థం వీరి కుమారులు చిందలూరు మల్లికార్జున, చిందలూరు రాఘవేంద్ర, కేదార్, కోడళ్ళు (సత్య కృపా సిల్క్స్ ధర్మవరం) వ్యవహరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి పరీక్షలు ఆపరేషన్లు అవసరమగు వారు ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులతో రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. అదేవిధంగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గిన తర్వాత రావాలని తెలిపారు. అంతేకాకుండా నేటి సమాజంలో నేత్రదానం అతి ముఖ్యమైనదని, నేత్రదానమును చేసి, అందత్వాన్ని కూడా నివారించాలని, తద్వారా రెండు జీవితాలలో వెలుగు నింపాలని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పట్టణములోని , గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు.


