విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎల్సికేపురం, వైయస్సార్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలు రెండు డి కొనగా, అప్పుడే అక్కడే విధులలో ఉన్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆ ప్రమాదాన్ని గమనించి, వెనువెంటనే తన వాహనంలో క్షతగాత్రులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అనంతరం ప్రభుత్వ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు. దీంతో స్థానికులు వన్ టౌన్ సీఐ మానవత్వాన్ని చాటుకుని చాటుకున్నారని, ఇప్పటికే వన్ టౌన్ పరిధిలో సిఐకు మంచి గుర్తింపు కలగని తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి, మెరుగైన వైద్యం అందించాలని కూడా తెలిపారు.
మానవతాన్ని చాటుకున్న వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్
- Advertisement -
RELATED ARTICLES


