విశాలాంద్ర ధర్మవరం ; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీనివాసులు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, గడ్డం కుళ్లాయప్పలను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం ట్రస్టర్ 2 పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాల్రెడ్డి ఆధ్వర్యంలో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపికైన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి నిరంతరం పోరాటం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కార దిశలో ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, కోళ్లమారం కేశవరెడ్డి, చెన్నారెడ్డి ,అశోక రెడ్డి, మల్లికార్జున, పెద్దన్న ,దేవరపల్లి శ్రీనివాసులు, చింతా శ్రీనివాసులు,తిరుమలరెడ్డి, కు, సాకే శ్రీనివాసులు, ప్రశాంతు ,ఆదిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నాగార్జున ,దాదు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ముగ్గురి ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


