Homeతెలంగాణఅధిక ఉత్పత్తులే లక్ష్యం

అధిక ఉత్పత్తులే లక్ష్యం

- Advertisement -

మంత్రులు తుమ్మల, ఉత్తమ్కుమార్ రెడ్డి
విశాలాంధ్ర-హైదరాబాద్: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తెచ్చి మెరుగైన ఉత్పత్తులు సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయశాఖ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం కార్యక్రమమం ద్వారా మంగళవారం దిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఎంపిక చేసిన ఏడు సన్న వరి రకాలకు ప్రోత్సాహకంగా బోనస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి విత్తనాలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా ఈ మేళాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 23 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతు వేదికల్లో నిర్వహించే ఈ విత్తన మేళాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాల విక్రయంతో పాటు వాటి సాగు పద్ధతులు, పంట యాజమాన్యం, అధిక దిగుబడుల సాధనకు సంబంధించిన సాంకేతిక సూచనలను అందించనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు ప్రత్యక్షంగా మార్గనిర్దేశం చేయన్నుారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాల కోసం 1,24,649 కిÇంటాళ్ల వరి విత్తనాలు, 6,913 కిÇంటాళ్ల పప్పుధాన్యాల విత్తనాలు, 11,815 కిÇంటాళ్ల నూనె గింజల విత్తనాలు, 1,339 కిÇంటాళ్ల కూరగాయల విత్తనాలు సిద్ధం చేశామని చెప్పారు. అదనంగా నానో యమూరియా, నానో డీఏపీ ఎరువులను రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, దొంతి మాధవరెడ్డి, యశస్వినిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర విత్తన్ఙాóవృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు