తెహ్రాన్: పశ్చిమాసియాలో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి… ముంచేసింది. తాజాగా ఇరాన్ దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ మీడియా ప్రకారం పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లు వెల్లడించింది. తమ యుద్ధనౌకపై దాడికి ప్రతిస్పందనగానే దాడి జరిగిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు. భారత్‌లోని విశాఖపట్నం నుంచి ఇరాన్‌కు తిరిగి వెళుతున్న ఐరిస్ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా ట్యాంకర్‌పై దాడి జరిగింది.
అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
- Advertisement -
RELATED ARTICLES


