ఘనంగా వియత్నాం నేషనల్ డే
హనోయ్: ఆగస్టు విప్లవానికి 80 ఏళ్లు నిండాయి. వియత్నాం మంగళవారం నేషనల్ డేను ఘనంగా జరుపుకున్నది. రాజధాని హనోయ్‌లోని బా దిన్ స్క్వేర్ వద్ద భారీ స్థాయిలో సైనిక పరేడ్ నిర్వహించింది. 21 తుపాకుల వందనంతో వేడుకలు మొదలయ్యాయి. ఆపై మిలటరీ పరేడ్ అట్టహాసంగా జరిగింది. సాయుధ దళాలు, పోలీసుల కవాత్తు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పరేడ్‌లో సైనిక వాహనాలను, వివిధ ఆయుధాలను ప్రదర్శించారు. పరేడ్‌ను వీక్షించడం కోసం సోమవారం రాత్రి నుంచే దేశ నలుమూలల నుంచి ప్రజలు, పర్యాటకులు హనోయ్‌కు చేరుకోగా అక్కడ పండుగ వాతావరణం నెలకొన్నది. 1945 ఆగస్టులో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నం (ఇప్పుడు సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం) అధ్వర్యంలో ఆగస్టు విప్లవం జరిగింది.


