Homeఅంతర్జాతీయంఇరాన్ కీలక నేతల హత్యలుఆక్షేపణీయం: చైనా

ఇరాన్ కీలక నేతల హత్యలుఆక్షేపణీయం: చైనా

- Advertisement -

బీజింగ్: అంతర్జాతీయ సంబంధాల్లో బలవంతపు చర్యలను తమ దేశం ఎప్ప్పుడు ప్రోత్సహించదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. ఇరాన్‌పై యుద్ధంలో భాగంగా ఆ దేశ కీలక నేతలను ఇజ్రాయిల్ `అమెరికా దళాలు వరుస పెట్టి చంపుతుండటాన్ని ఆక్షేపించింది. పౌర క్షేత్రాలపై, నాయకు లపై ప్రత్యక్ష దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇరాన్ జాతీయ భద్రతాధికారి అలీ లారిజానీ హత్యను గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. తక్షణమే సైనిక ఆపరేషన్లను విరమించుకోవాలని, ప్రాదేశిక ఉద్రిక్తలు పెరగకుండా నివారించాలని, పరిస్థితిని చేయిదాటనివ్వొద్దని అమెరికా, ఇజ్రాయిల్‌తో పాటు ఇరాన్‌కు హితవు పలికింది. యుద్ధం ఆపేంలా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని చైనా పేర్కొంది. ఇప్పటికే పశ్చిమాసియాకు తమ ప్రత్యేక రాయబారి జాయ్ జున్ ఆ ప్రాంతంలో తిరుగుతూ, ఉన్నత స్థాయి అధికారులతో భేటీలు నిర్వహిస్తున్నారని లిన్ జియాన్ వెల్లడించారు. ఇప్పటికే సౌదీ, యూఏఈ, బెహ్రెయిన్, కువైట్, ఈజిప్టులో పర్యటించినట్లు తెలిపారు. సైన్యంతో సంబంధం లేని క్షేత్రాలపై దాడులు చేయొద్దని, షిఫ్పింగ్ లేన్లకు రక్షణ కల్పించాలని జాయ్ కోరినట్లు లిన్ జియాన్ చెప్పారు. యుద్ధం కొనసాగేంత వరకు దౌత్యపరంగా మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయని ఆయనన్నారు. కాగా, ఇరాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌కు మానవతా సాయాన్ని చైనా ఇప్పటికే ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు