Homeఅంతర్జాతీయంఇరాన్‌లో ఆగిన 800 మరణశిక్షలు

ఇరాన్‌లో ఆగిన 800 మరణశిక్షలు

- Advertisement -

గల్ఫ్‌ డౌత్యంతో సైనిక చర్యలపై ట్రంప్‌ వెనక్కి: శ్వేతసౌధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిళ్లకు తలొగ్గి, 800 మంది మరణశిక్షలను ఇరాన్‌ ఆపినట్లు శ్వేతసౌధం వెల్లడిరచింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లో తీవ్రరూపం దాల్చిన ప్రజా నిరసనల వేళ సైనిక చర్యలపై గల్ఫ్‌ మిత్రపక్షాలు కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లు పేర్కొంది. గతవారం ఇరాన్‌ నిరసనలతో దద్దరిల్లింది. వారం పాటు ఇంటర్నెట్‌ బ్లాకౌట్‌ కొనసాగింది. ప్రజలు శాంతించినట్లు కనిపించినప్పటికీ ఉద్రిక్తలు పూర్తిగా సర్దుమణగలేదు. ఈ క్రమంలో సైనిక చర్యలకు అమెరికా సిద్ధం కాగా, గల్ఫ్‌ మిత్రపక్షాలు అడ్డుచెప్పాయి. దీంతో ట్రంప్‌ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలీన్‌ లీవిట్‌ తెలిపారు. ప్రదర్శనకారులకు మరణశిక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని తెహ్రాన్‌ను ట్రంప్‌ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌ అధికారులు లక్ష్యంగా కొత్త ఆంక్షలను కూడా ట్రెజరీ ప్రకటించింది. అణు కార్యక్రమం క్రమంలో ఇప్పటికే ఇరాన్‌పై అనేక ఆంక్షలు ఉన్నాయి. కొత్త ఆంక్షలతో ఆ దేశానికి ఆర్థికపరంగా సవాళ్లు మరింతగా పెరిగాయి. నార్వేకు చెందిన ఇరాన్‌ మానవ హక్కుల ఎన్జీవో ప్రకారం ఇరాన్‌ భద్రతా దళాలు 3,428 మంది నిరసనకారులను చంపినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అంచనా ఉన్నది. మరణ శిక్షలు అమలు కాబోవు అంటూ అవతలి పక్క నుంచి కీలక వర్గాల భరోసా ఉండటంతో పాటు గల్ఫ్‌ మిత్రపక్షాలు కూడా వెనక్కు లాగుతుండటంతో సైనిక చర్యల నిర్ణయాన్ని ట్రంప్‌ విరమించుకున్నారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. ట్రంప్‌ హెచ్చరికలతో ఇరాన్‌ వెనక్కి తగ్గిందని, అక్కడి పరిస్థితులను అధ్యక్షుడు నిశితంగా గమనిస్తున్నట్లు కూడా వెల్లడిరచాయి. భవిష్యత్తులో ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని పేర్కొన్నాయి. ఇదిలావుంటే, సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్‌ బిన్‌ పర్హాన్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఫోన్‌లో మాట్లాడారు. ఏ విదేశీ బెదిరింపులకు ఇరాన్‌ లొంగదని అన్నారు.
దాడుల కోసం తమ భూభాగాన్నిగానీ గగనతలాన్నిగానీ వినియోగించేందుకు అనుమతి ఇవ్వబోమంటూ ఇరాన్‌కు సౌదీ అరేబియా. తెలిపింది. ఇరాన్‌పై సైనిక చర్యల కోసం బుధవారం వరకు అమెరికా బెదిరించింది. గల్ఫ్‌ దౌత్యంతో దాడులపై వెనక్కి తగ్గింది. ఆందోళనకారుడు ఇర్ఫాన్‌ సొల్టాని (26) అరెస్టు అయినప్పటి నుంచి తెహ్రాన్‌ వెలుపల కరాజ్‌ జైల్లో ఉన్నారు. ఆయనకు మరణశిక్ష అమలవుందని హక్కుల సంఘాలు వెల్లడిరచగా, అమలు చేయలేదని ఇరాన్‌ న్యాయస్థానం తెలిపింది. ఇరాన్‌ ఇస్లామిక్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు సొట్లానిపై ఆరోపణలు రుజువైతే మాత్రం ఆయనకు చట్టప్రకారం శిక్ష ఉంటుందని వెల్లడిరచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు