Homeవ్యాపారంఈశాన్య భారత పారిశ్రామిక స్ఫూర్తిని వెలుగులోకి తెచ్చిన మెటా

ఈశాన్య భారత పారిశ్రామిక స్ఫూర్తిని వెలుగులోకి తెచ్చిన మెటా

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా, ఈశాన్య భారతదేశం నలుమూలల నుంచి చిన్న వ్యాపార యజమానులను వారి విజయగాధలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వృద్ధికి కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు మెటా నేడు గౌహతిలో ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహించి, వారందరినీ ఒక్కచోటుకు చేర్చింది. ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 350 మంది వ్యాపార ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై, తమ ప్రాంతపు పారిశ్రామిక స్ఫూర్తిని చాటిచెప్పారు. భారతదేశంలో మెటా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వ్యాపారాలలో 92% కన్నా ఎక్కువ చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయి. నిత్యం, పారిశ్రామికవేత్తలు పరిమిత వనరులు, చిన్న బృందాలతో వినియోగదారులను కనుగొనేందుకు, బ్రాండ్‌లను నిర్మించేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్లను ఉపయోగిస్తున్నారు. భారతదేశం వృద్ధి గాధకు చిన్న వ్యాపారాలే ప్రాణం. ఈ కార్యక్రమంలో, ఈశాన్య ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు తాము విస్తరించగల బ్రాండ్‌లను ఎలా నిర్మిస్తున్నారో, స్థానిక ఉద్యోగాలను ఎలా సృష్టిస్తున్నారో, తమ సముదాయాలలో ఆవిష్కరణలను ఎలా ప్రోత్సహిస్తున్నారో వివరించారు. స్వదేశీ బ్రాండ్‌లు, కళాకారులు, స్థానిక రిటైలర్లు, సృష్టికర్తల విభిన్న సమ్మేళనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరి విజయగాథలు ఈశాన్య భారతదేశం వ్యాపార వర్గాల పెరుగుతున్న ఆశయాలను ప్రతిబింబిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు