Homeఆంధ్రప్రదేశ్ఐఎమ్‌టి హైదరాబాద్‌లో ముగిసిన అభ్యుదయ 2026

ఐఎమ్‌టి హైదరాబాద్‌లో ముగిసిన అభ్యుదయ 2026

- Advertisement -

హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎమ్‌టి), హైదరాబాద్ తమ మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అభ్యుదయ 2026ను, “మేనేజ్‌మెంట్ విద్యార్థుల నుండి పరిశ్రమ అంచనాలు: మీ బిస్కూల్ ప్రయాణాన్ని అత్యుత్తమంగా మలచుకోవడం” అనే ఇతివృత్తంతో జరిగిన ముగింపు ప్యానెల్ చర్చా కార్యక్రమంతో ముగించింది. ఈ చర్చా కార్యక్రమంలో బెర్కాడియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ హెచ్‌ఆర్ అనుకుల్య పాండా: ఐక్యూఈక్యూ గ్లోబల్ సర్వీసెస్ ఇండియా కంట్రీ డెలివరీ డైరెక్టర్ నవీన్ రాజ్దేవ్: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కార్పొరేట్ సెంటర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ ఐషిక్ భట్టాచార్య: జౌల్స్టువాట్స్‌ బిజినెస్ సొల్యూషన్స్‌ లిమిటెడ్ సీటీఓ వినీత్ శుక్లా, ఏఎమ్ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ పునియాతో సహా పలువురు ప్రముఖ పరిశ్రమ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేట్ రిలేషన్స్‌ ఆఫీస్ హెడ్ అయిన ప్రకాష్ పాఠక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చ, సాంకేతికత ఆధారిత వ్యాపార వాతావరణంలో భవిష్యత్ మేనేజ్‌మెంట్ నిపుణుల నుండి సంస్థలు ఆశిస్తున్న అంశాలపై దృష్టి సారించింది. కార్పొరేట్ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన పటిష్టమైన పునాదులు, నిరంతర అభ్యాసం, ఏఐ బాధ్యతాయుతమైన వినియోగం, అనుకూలత యొక్క కీలక ప్రాముఖ్యతను ఈ సమావేశం లోతుగా పరిశీలించింది. తక్షణ ప్రతిఫలం కంటే అభ్యాసానికి, సంస్థాగత అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సునీల్ పునియా విద్యార్థులను ప్రోత్సహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు