Homeఏపీకి భారీగా పెట్టుబడులు

ఏపీకి భారీగా పెట్టుబడులు

- Advertisement -

క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్

విశాలాంధ్ర-సత్యవేడు :కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రపంచ దిగ్గజం ‘క్యారియర’ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని రాష్ట్ర ఐటీ, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియో జకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యÖనిట్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తీసుకువస్తు న్నామని తెలిపారు. అవకాశాలను అందిపు చ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉందని, సమర నాయకత్వంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయని అన్నారు. 2027 నాటికి ఏసీల ఉత్పత్తిలో 60 శాతం ఏపీ నుంచేనని అన్నారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. ముందుగా క్యారియర్ గ్లోబల్ సంస్థ నాయకత్వానికి, చైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్‌కు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నానని అన్నారు. శ్రీసిటీ క్యారియర్ సంస్థ ఏపీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 3 వేల ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఆయన వివరించారు. 31 దేశాల నుంచి 250 కి పైగా కంపెనీలు శ్రీసిటీలో నడుస్తున్నాయని, ఇక్కడి నుంచి 6 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. 70 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారని అన్నారు. వీరిలో సగం మంది మహిళలు ఉన్నారని తెలిపారు. డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలని, డేటా సెంటర్ల నిర్మాణం, పవర్ ఏఐలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పోటీ నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉందన్నారు. కేవలం డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాకుండా… వాటిని నడిపించే వ్యవస్థలను కూడా నిర్మించడమే మన ముందున్న లక్ష్యమని తెలిపారు. విశాఖ పట్టణం గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. క్యారియర్ సంస్థ ఇక్కడ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబు విజన్ సాధనకు తామంతా కలిసి పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. అనంతరం క్యారియర్ సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్.గిట్లిన్, క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ క్లైమేట్ సొల్యూషన్స్ ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మైకేల్ ఎల్.గియర్జెస్, క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ డుయిజర్, చీఫ్ పీపుల్ అండ్ కమÖ్యనికేషన్స్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నడియా విల్లెనెవ్, క్యారియర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శ్రీసిటీ రవీంద్ర రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జేసీ ఆర్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు