Homeసినిమాకల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్?

కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్?

- Advertisement -

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం (సీక్వెల్) శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్‌లకు సంబధించి కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ ప్రత్యేక మైన సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ప్రభాస్ పై ఎంట్రీ సాంగ్ ను చిత్రీకరిస్తారట. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయ కుడిగా కనిపించనున్నారు. ‘కల్కి సీక్వెల’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని సమాచారం. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ముగింపు కూడా కర్ణుడు పాత్రతోనే కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందని భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు