Homeకాంగ్రెస్‌కు ముందుచూపు లేదు

కాంగ్రెస్‌కు ముందుచూపు లేదు

- Advertisement -

. ఎన్టీఏ పాలనలో దేశం పురోగమిస్తోంది
. బెంగాల్‌లో అక్రమ వలసదారులకు రక్షణ
. రాజ్యసభలో ప్రధాని మోదీ

న్యూదిల్లీ: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి దేశ భవిష్యత్తుపై దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. తనతోపాటు ఓ వర్గంపైనా ద్వేషాన్ని పెంచుకుంటోందన్నారు. ఇటీవల లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. దీనిపై లోక్‌సభలో చర్చ జరగకపోవడం అత్యున్నత పదవికే అవమానకరమన్నారు. అక్రమార్కులను రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తోందని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ వలసదారులను బయటకు పంపించివేస్తుంటే బెంగాల్‌లో మాత్రం అటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, దేశ ప్రజల హక్కులు హరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదని… దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోందన్నారు. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఎన్డీయే హయాంలో మూడో స్థానానికి చేరుకోనుందని చెప్పారు. తయారీ రంగంలో బలమైన ఎకో సిస్టమ్ ఉంటేనే ఒప్పందాలకు ముందుకొస్తారని చెబుతూ… రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్.. నినాదంతో దూసుకెళ్తున్నామన్నారు. అన్ని విషయాల్లో పోటీ పడేందుకు భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. మనదగ్గర యువత జనాభా అధికంగా ఉంది. మన యువతకు ప్రపంచ దేశాలన్నీ స్వాగతం పలుకుతున్నాయని తెలిపారు. బ్యాంకుల బలోపేతానికి అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలిచాం. బ్యాంకుల నుంచి ఇప్పుడు పేదలకు రుణాలు అందుతున్నాయి. ముద్ర యోజన ద్వారా అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారని… దీని కింద రూ.30లక్షల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 10కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు లబ్ధి పొందారు. 2014 తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను తీసేసి నీతిఆయోగ్‌ను తెచ్చాం. ఇది వేగంగా, సమర్థంగా పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు