Homeజాతీయంగజా మారణకాండపై మాట్లాడండిమోదీకి ప్రియాంకాగాంధీ విజ్ఞప్తి

గజా మారణకాండపై మాట్లాడండిమోదీకి ప్రియాంకాగాంధీ విజ్ఞప్తి

- Advertisement -

న్యూదిల్లీ: ఇజ్రాయిల్ పార్లమెంటు ‘నెసెట’లో గజాలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి ప్రారంభమైన ప్రధాని రెండు రోజుల అధికారిక పర్యటన నేపథ్యంలో ఆమె సామాజిక మాధ్యమం ‘ఎక్స’ వేదికగా ప్రధానికి ఈ సూచన చేశారు. గజాలో వేలాది మంది బలైపోతున్న తీరును ‘మారణకాండ’గా అభివర్ణించిన ప్రియాంక… ఈ అంశాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించి, బాధితులకు న్యాయసాయం అందించాలని కోరారు. స్వతంత్ర భారత చరిత్రలో అనాదిగా మనం అనుసరిస్తున్న సత్యం, శాంతి, న్యాయం వైపు నిలబడే సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె ప్రధానికి గుర్తు చేశారు. గజా అంశంపై ప్రియాంకాగాంధీ మొదటి నుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలకు హాజరైన సమయంలోనూ ఆమె పలస్తీనాకు మద్దతుగా గళం వినిపించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయిల్-హమాస్ మధ్య కుదిరిన ‘సమగ్ర శాంతి ప్రణాళిక’ ఒప్పందం తర్వాత యుద్ధం తగ్గుముఖం పట్టినప్పటికీ… గజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ సైతం గజాలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు