Homeజాతీయంజేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

- Advertisement -

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్‌తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని ప్రకటించిన ఆయన… నితీశ్‌తో మాత్రం అనుబంధం కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీలో చేరడం లేదా కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు