Homeఆంధ్రప్రదేశ్టీటీడీ ఈవో రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

టీటీడీ ఈవో రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

- Advertisement -

విశాలాంధ్ర – తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమల ఆలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. టీటీడీ బోర్డు ఎక్సఅఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు సంప్రదాయం ప్రకారం వరాహ స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. నూతన ఈవోకు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం రవిచంద్రకు పండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ బోర్డు, భక్తుల సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో చక్కని సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు